టీయూడబ్ల్యూజె డైరీ ఆవిష్కరణ…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఫిబ్రవరి 1: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె ఐజెయు) కరీంనగర్ జిల్లా శాఖ రూపొందించిన నూతన సంవత్సర డైరీ- 2021ని సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, జానంపేట మారుతి స్వామి, కోశాధికారి శరత్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈద మధుకర్ రెడ్డి, బల్మూరి విజయసింహరావు, కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు విజయభాస్కర్, సంయుక్త కార్యదర్శి ఎండి.షుకూర్ తో పాటు వివిధ దిన పత్రికల జిల్లా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 2020లో పత్రిక రంగంలో పనిచేసే వారికి, ముఖ్యంగా జర్నలిస్టులకు అనేక ఇబ్బందులు, ఒడిదుడుకులతో చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లోనైనా జర్నలిస్టుల జీవితాలు మంచిగా కొనసాగాలని ఆకాంక్షించారు. రాబోయే రెండు మూడు నెలల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కాారానికి కార్యాచరణ రూపొందించుకుని ముందుకువెళదామని అన్నారు.