JMS News Today

For Complete News

ఆ జిల్లాలో విషాద ఘటన….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

సంగారెడ్డి, ఆగస్టు 6: సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల గొంతు నులిమి చంపిన అనంతరం తల్లి ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టింది. ఈ విషాద ఘటన సంగారెడ్డిలోని శాంతినగర్ లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. చిన్నారులు దేవాన్ష్ (6), రుద్రాన్ష్ (4) మృతి చెందగా, తల్లి జోత్స్న ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారుల మృతదేహలను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కుటుంబ కలహలే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *