JMS News Today

For Complete News

కరీంనగర్ లో మరో రెండు కరోనా కేసులు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మార్చి 30: కరీంనగర్ లో మళ్ళీ కలకలం సృష్టిస్తోంది. కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.  ఇదివరకు పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులకే తాజాగా పాజిటివ్ రాగా, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇవాళ సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ కె శశాంక ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం 8 మంది కుటుంబసభ్యులు ఉండగా, వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి నేగిటివ్ వచ్చిందని, అందరిని గాంధీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. రెడ్ జోన్ పరిధిలో గృహనిర్బంధం కోనసాగుతుందని చెప్పారు. 622 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ క్వారంటైన్ లో 35 మంది, చల్మెడ ఆసుపత్రిలో 49 మంది ఉన్నారని, మరో ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ లో ఉన్నారని వివరించారు.
కరీంనగర్ లోని ముకురంపుర ప్రాంతంలో మరోసారి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్తారని,
ముకరంపుర ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి కి హెల్త్ స్క్రీనింగ్ చేస్తామని, దయచేసి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఇప్పటి దాకా కరీంనగర్ జిలాల్లో మొత్తం 105 షాంపుల్స్ టెస్ట్ చేసామని, రాష్ట్రంలోనే ఇంతగా టెస్ట్ షాంపుల్స్ చేసిన ప్రాంతం కరీంనగరేనని అన్నారు. జిల్లాలో 14,995 మంది వలస కూలీలు ఉన్నారని,
వలస కూలీలకు ఒక్కొక్కరికి 500 రూపాయల నగదు, 12 కిలోల బియ్యం మంగళవారం సాయంత్రంలోగా పంపిణీ చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ మంగళవారం నుంచి రాత్రి వేళల్లో కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. పాజిటివ్ వచ్చిన ఆ ముగ్గురిలో ఎవరెవరూ కలిసారో ముందుకు వచ్చి చెప్పాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *