JMS News Today

For Complete News

రెండో రోజు సైతం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మార్చి 29: పలు డిమాండ్ల సాధన కోసం తపాల ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగింది. అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం, నేషనల్ యూనియన్ పోస్టల్ ఎంప్లాయిస్ సంఘం పిలుపు మేరకు రెండ్రోజుల సమ్మెలో భాగంగా పోస్టల్ జెసీఏ ఆధ్వర్యంలో రెండో రోజు మంగళవారం కరీంనగర్ ప్రధాన తపాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను, వైఖరిని నిరసిస్తూ తపాల ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పోస్టల్ ఏజెంట్స్ సంఘం నాయకులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ధర్నా శిబిరానికి చేరుకుని
మద్దతు తెలిపారు. పోస్టల్ జెసిఏ కన్వీనర్ రఘు మోహన్, జాయింట్ కన్వీనర్ రామచంద్రం, ఎ.రమేష్, బి.శ్రీధర్ బాబు, ఎన్.లక్ష్మి నారాయణ, డి.మల్లేశం. జి.సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళనలో నాయకులు అనిల్, గంగయ్య, రాజ్ కుమార్, క్రిష్ణకాంత్, అంజయ్య, శివకృష్ణ చక్రపాణి, రాజమల్లు, పవన్ కుమార్, సదయ్య, సురేశ్, సుగుణాకర్, వేణు, కే. రాజు, నసీర్ర్, శ్రీనివాస్, ప్రీత పౌల్ సింగ్, విజయ్, సత్య, ఉదయ్, శివరాం, లక్ష్మిరాజం, రేణుక, హారిక, వీణ, శిరీష, స్రవంతిలతో పాటు ఉద్యోగులు, గ్రామీణ తపాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రెండ్రోజుల సమ్మెను విజయవంతం చేసిన ఉద్యోగులకు, మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *