ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 29: కరీంనగర్ పోలీస్ రేంజ్ పరిధిలో ఇద్దరు ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. కరీంనగర్ రేంజ్ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐలు సస్పెన్షన్ చేస్తూ సిఐడి విభాగం ఐజి, కరీంనగర్ రేంజ్ ఇంఛార్జి డీఐజీ పి.ప్రమోద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసును నమోదు చేయడంలో ఆలస్యం చేయడం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలం కావడం లాంటి కారణాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ప్రవీణ్ ను సస్పెండ్ చేేశారు. అలాగే కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ ఎస్ఐ ఎన్ వెంకటేష్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కలపను తెప్పించి వివిధ రకాల వస్తువులను తయారు చేసినందుకుగాను ఆయనను సస్పెండ్ చేశారు.