ఆ ఇద్దరు తహసీల్దార్లపై వేటు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
సూర్యాపేట, జూలై 16: విధుల్లో వ్యవహరించిన నిర్లక్ష్యం..వారి ఉద్యోగాలకు ఎసరొచ్చింది. సూర్యాపేట జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లపై వేటు పడింది. హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల తహసీల్దార్లను కలెక్టర్ అమయ్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మేళ్లచెరువు తహసీల్దార్ దుగ్యాల శంకరయ్య, చింతలపాలెం తహసీల్దార్ బాబా షర్ఫుద్దీన్లను సస్పెన్షన్ చేశారు. సమాచారం లేకుండా గైర్హాజరు కావడం వంటి కారణాల దృష్ట్యా సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.