పండుగ పూట విషాదం….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కామారెడ్డి, సెప్టెంబర్ 2: పండుగ పూట విషాదం నెలకొంది. ఇద్దరు యువకులు కాల్వలో గల్లంతైన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి వాగులో ఈత కొడుతుండగా, నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో నీటిలో కొట్టుకుపోయారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే గాలించగా, ఒకరి మృతదేహం దొరికింది. మరోకరి కోసం గాలిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.