ఆ రెడ్డి యూటర్న్…?
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 13: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా అంటే ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు అవుననే అనిపిస్తోంది. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకం కాదని ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో నెలకొన్న వాస్తవ పరిస్థితిపైనే తాను మాట్లాడానన్న రాజగోపాల్ రెడ్డి..అధిష్ఠానం తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోదని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలో కార్యకర్తల కష్టనష్టాలను పట్టించుకునే వారే లేరని విమర్శించారు. అంతేకాకుండా కుంతియా, ఉత్తమ్ల సారథ్యంలో పార్టీ కోలుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. కాగా, గతంలో పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్రెడ్డి.. బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.