JMS News Today

For Complete News

కరీంనగర్ సీపీగా బాధ్యతల స్వీకరణ…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 30: కరీంనగర్ కమిషనరేట్ నూతన పోలీసు కమిషనర్‌గా వి. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల బదిలీ అయిన పోలీసు కమిషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి నూతన కమిషనర్ సత్యనారాయణ కు బాధ్యతలను అప్పగించారు. తొలుత గౌరవ వందనం స్వీకరించిన నూతన సీపీ సత్యనారాయణ అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్బంగా బదిలీపై వెళుతూ బాధ్యతలను అప్పగించిన కమలాసన్‌రెడ్డికి నూతన సీపీ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం కమిషనరేట్లో అమలు చేస్తున్న పోలీసు సంస్కరణలు, శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన అంశాలు, 2017 నుండి కమిషనరేట్ దేశవ్యాప్తంగా వివిధ అంశాల్లో గుర్తింపు పొందిన అంశాలపై కమలాసన్ రెడ్డి నూతన కమిషనర్‌ సత్యనారాయణకు వివరించారు. కాగా, నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ 1999లో డిఎస్పీగా పోలీస్ శాఖలో చేరారు. అదే హోదాలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో పనిచేశారు. మల్కాజ్ గిరి ఏసిపిగా, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఓఎడిగా, అక్కడే అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. 2006లో ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన ముఖ్యమంత్రి భద్రత విభాగం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా 2011 డిసెంబర్ 26 నుండి పనిచేశారు. అప్పుడు ముఖ్యమంత్రులుగా కొణిజేటి రోషయ్య , కిరణ్ కుమార్ రెడ్డిలు కొనసాగారు. అక్టోబర్ 10 నుండి 2014 వరకు హైదరాబాద్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ గా, సౌత్ జోన్ డిసిపిగా పనిచేశారు. జిల్లాల పునర్విభన అనంతరం నూతనంగా ఏర్పడిన కమిషరేట్లు, జిల్లాల సందర్భంగా రామగుండం కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. గత సంవత్సరం డిఐజిగా పదోన్నతి పొందిన ఆయన అక్కడే కమిషనర్‌గా విధులను నిర్వహిస్తూ ఇటీవల బదిలీ కాగా, శుక్రవారం కరీంనగర్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు ఎస్.శ్రీనివాస్ (ఎల్ అండ్ ఓ), జి చంద్రమోహన్ (పరిపాలన), ఏసీపీలు పి అశోక్, విజయసారధి , శ్రీనివాస్, మదన్‌లాల్, తుల శ్రీనివాసరావు , రాములు, ఎసిబిఐ రాజేష్ లతో పాటుగా వివిధ విభాగాలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *