కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, నవంబర్ 17: రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన వెదిర వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కాళేశ్వరం దేవాలయం, మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల, నంది మేడారం పంప్ హౌస్ లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పులి కొమురయ్య, వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ ఎడవెల్లి సత్య నారాయణ రెడ్డి, సభ్యుడు మొండయ్య, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్, చంద్రారెడ్డి, మునిరెడ్డి, మురళి, శంకరయ్య, సిద్ధార్థ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.