JMS News Today

For Complete News

పేదలకు కూరగాయల పంపిణీ

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఏప్రిల్ 22: కరీంనగర్ నగరానికి చెందిన సాత్పడి చంక్రాంకిత, అద్వికల పుట్టిన రోజు సందర్భంగా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం జిల్లా శాఖ ఉపాధ్యక్షులు సాత్పడి శ్రీచరణ ఆధ్వర్యంలో బుధవారం 21వ డివిజన్ పరిధిలోని పేదలకు కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ తుల రాజేశ్వరి-బాలయ్య, చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం గౌరవ అధ్యక్షుడు జానంపేట మారుతీ స్వామిలు హజరై పేదలకు పంపిణీ చేశారు. వంద మందికి ఆ డివిజన్ మున్సిపల్ కార్మికులతోపాటు దినసరి కూలీ చేసుకునే పేదలకు ఆరు రకాల కూరగాయలు అందజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల కార్పొరేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సాత్పడి యుగేందర్, సాత్పడి అరవింద్, ఎ.హరిత, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *