JMS News Today

For Complete News

రిబ్బన్ కట్ చేసిన మంత్రి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 11: జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ లో  రూ.1.40 కోట్ల తో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ను గురువారం జడ్పీ చైర్ పర్సన్ విజయతో కలిసి వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రాజేందర్ మాట్లాడుతూ, మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ దయతో గెలిచిన సంవత్సరం తరువాత మిమ్మల్ని కలుసుకున్నానని అన్నారు. మాకు వచ్చిన పదవులు మీరు పెట్టిన భిక్ష, ఎ కష్టం లేకుండా, సులువుగా గెలిచిన జడ్పీ చైర్ పర్సన్ పదవి ఒక్క మన కరీంనగర్ జిల్లాకే దక్కిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్టంలోనే అతి తక్కువ ఖర్చుతో గెలిచింది జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాం వెంకట స్వామి, నన్ను మీరు 6 సార్లు గెలిపించారని, నేను వాళ్ళ గుండెల ఉన్న బిడ్డనే కాబట్టి నన్ను గెలిపించారని అన్నారు.
నేను ఎప్పటికి ఇలాగే ఉంటాను..ఎప్పటికి మారను..చిల్లర మల్లర రాజకీయాలు చేయను..నేను ఇలాగేనే ఉంటాను అంటూనే..  గెలిచిన జడ్పీటీసీలు, ఎంపిటిసిలు పని చేసి ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోండి.. ప్రజల ఆశీర్వాదంతో,ప్రేమతో మీరు గెలిచారని సూచించారు. గ్రామాలు పట్టణాలుగా మారాయి, ఉపాధి హామీ పనులు లేవని, కొత్తగా ఏర్పడబోయే పాలక వర్గం అభ్యర్థులను ప్రజలు సూచించిన అభ్యర్థులకె ఇస్తామని స్పష్టం చేశారు. పైసలు, పదవులు ఆశించకుండా ఉండేవాళ్లనే ఎన్నుకోండి..ప్రజలకి పని చేసే వాళ్ళను రూపాయి ఆశించకుండా ఉండేవారిని మాత్రమే సూచించి, గెలిపించాలని కోరారు. మీ ఓటులోనే మీ భవిష్యత్తు ఉంది, ఓటు అనేది మీ ఆత్మగౌరవమని, మిమ్మల్ని, మీ ఓటును కొనేవారిని మాత్రం ఎన్నుకోకండని, అలాంటి వారిని మీ విధులలో తిరగకండంటూ సూచించారు. ఆపదలో ఉన్నవారికి మాత్రం నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మార్కెటింగ్ లో ఆన్ లైన్ విధానం దేశం మొత్తంలో ఉందని, 28 మంది పేదలకు మాత్రమే మార్కెట్ లో అవాకాశం ఇచ్చినట్లు తెలిపారు. మొన్న ఎన్నికల ముందు 40 కోట్ల రూపాయలు పురపాలక సంఘానికి అభివృద్ధి కోసం ఇచ్చినట్లు, పట్టణంలో ఉన్న పేదరికం పల్లెలో కన్నా ఎక్కువగా ఉందని అన్నారు. కోట్ల రూపాయలతో ఎంత అభివృద్ధి చేసిన పేదల బ్రతుకులు మారితేనే అభివృద్ధి జరిగినట్లు అంటూ పేర్కొన్నారు. ఎవరికి ఎక్కడ వైద్యం అవసరమున్న నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్లో కూడా అన్ని రకాల వసతులు కల్పించామని, పేదరికానికి, కష్టానికి, ఆకలికి అందుబాటులో ఉండే బిడ్డడు ఈటల రాజేందర్ అని చెప్పారు. పేద పిల్లల మీద ఒక్కొక్క విద్యార్థి, విద్యార్థిని మీద 1,05,000 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందని, రాబోయే రోజుల్లో చికెన్, మటన్, చేపల మార్కెట్ కూడా నిర్మిస్తామని తెెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *