JMS News Today

For Complete News

సమయాల్లో సడలింపు..12గంటల వరకు ఛాన్స్

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మార్చి 26: నగరంలో కర్ఫ్యూ ఉన్నందున నిత్యావసర వస్తువులైన కిరాణం, సూపర్ మార్కెట్లు, పాలు, కూరగాయలు, మెడికల్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్దేశిత సమయంలో తెరిచి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, వ్యాపారుల సంఘాల అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నిత్యావసర వస్తువులు 6 గంటల నుండి 1 2 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని, వ్యాపారులకు సంబంధించిన లైసెన్సు, వారి దగ్గర పనిచేయుచున్న వారి పేర్లు, చిరునామా లిస్టును అందించినట్లైతే ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ నెంబర్ ఇచ్చినట్లైతే ఐ.డీ కార్డు, కర్ఫ్యూ పాస్ లు పోలిస్ కమీషనర్ గారు ఇస్తారని అన్నారు. వ్యాపారులు ఏమైనా సమస్యలుంటే ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. పోలీసులు ఆపినట్లైతే వారి ఐ.డీ కార్డు, కర్ఫ్యూ పాసు పోలీసులకు తప్పనిసరిగా చూపించి వెళ్లవచ్చని తెలిపారు. కంట్రోల్ రూం లో అసోసియేషన్ కు సంబంధించిన వ్యక్తి తప్పనిసరిగా ఉండాలని, అత్యవసర విషయాలుంటే తెలియజేయాలని అన్నారు. కూరగాయలు రైతు బజారు నుండి మార్కెట్ యార్డుకు మార్చడం జరిగిందని, ప్రజలు గుంపులు గుంపులుగా ఉండవద్దని, ఒకరి తర్వాత ఒకరు కూరగాయలు కొనుగోలు చేయాలని, మనిషి మనిషి ఒక మీటరు దూరం ఉండాలని ఆయన అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, పోలిస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి, మేయర్ వై.సునీల్ రావు, మున్సిపల్ కమీషనర్ క్రాంతి, ఆర్డీఓ అనంద్ కుమార్, మార్కెటింగ్ శాఖ డిడి పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, హార్టికల్చర్ డిడి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, వ్యాపారుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *