వీఆర్వో, వీఆర్ఏల సస్పెండ్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రాజన్న సిరిసిల్ల, జూలై 27: విధుల్లో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడింది. భూ దస్త్రాల నవీకరణలో నిర్లక్ష్యం వహించిన వీఆర్వో, వీఆర్ఏలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. కోనారావుపేట మండలం సుద్దాల గ్రామ వీఆర్వో సీహెచ్ రాజేశ్వరరావు, బోయినిపల్లి మండలం స్థంభంపల్లి వీఆర్ఎ అమ్ముల శ్రీనివాస్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.