కోర్టు సంచలనాత్మక తీర్పు…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
వరంగల్, ఆగస్టు 8: వరంగల్ జిల్లా న్యాయస్థానం (ఫాస్ట్ ట్రాక్ కోర్టు) సంచలనాత్మక తీర్పు వెలువరించింది. తొమ్మిది మాసాల పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ప్రవీణ్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. కోర్టులో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో న్యాయమూర్తి జయకుమార్ ప్రవీణ్ కు ఉరిశిక్ష విధిస్తూ గురువారం సంచలన తీర్పు చెప్పారు. కేవలం 48 రోజుల లోనే నిందితుడు ప్రవీణ్ కి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు నివ్వడం పట్ల చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కు న్యాయవాదులు సహాయ నిరాకరణ చేయగా, నేరస్తుడికి ప్రభుత్వం తరపున ఒక న్యాయవాదిని సమకూర్చి జిల్లా న్యాయస్థానం విచారణ జరిపింది. మొత్తానికి కేవలం 48 రోజుల్లో కోర్టు తీర్పు నివ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.