ఆ గ్రామంలో ఎం చేశారో తెలుసా…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 28: ఆదిలో మురిపించిన వరణుడు ఆ తరువాత మొఖం చాటేసాడు. గత రెండు రోజులుగా ఆకాశంలో మేఘాలు కమ్ముతూ ఊరిస్తున్నాయే తప్ప వర్షం కురువడం లేేదు. వర్షాలు లేేేక రైతన్న లు తల్లడిల్లిపోతున్నారు. అటు భూగర్భ జలాలు పడిపోయాయి తాగునీటి సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లె గ్రామం లో కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు కురువాలని కోరుతూ… శుక్రవారం దేవుళ్ళ కు జలాభిషేకం చేశారు. ఊరిలో ఉన్న అన్ని దేవాలయాలకు బిందెలకొద్దీ నీళ్లతో వెళ్ళి దేవుళ్ళ కు జలాభిషేకం చేశారు. వర్షాలు కురువాలని ఆ దేవుళ్ళ కు మొక్కులు మొక్కారు.