ట్యాంక్ ఎక్కిన రైతులు….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
మంచిర్యాల, జూలై 22: మంచిర్యాల జిల్లా భీమారo మండలం మద్దికల్ శివారు ప్రాంతo లో కొంత మంది రైతుల భూములను కొంత మంది కబ్జాదారులు అక్రమంగా పట్టాలు చేసుకోగా, ఈ విషయంలో గత రెండు సంవత్సరాలుగా తిరుగుతున్నా… పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సోమవారం మండల కేంద్రంలోని నీళ్ల ట్యాoక్ ఎక్కి రైతులు నిరసన తెలిపారు. తమ సమస్య పరిష్కరించకపోతే ట్యాoక్ పై నుండి దిగుతామని హెచ్చరించడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు సంవత్సరాల క్రితం భీమారo తహశీల్దార్ కార్యాలయం వద్ద 150 రోజులు నిరసన తెలిపినప్పటికీ ఆర్డీఓ మా ఫైల్ ని ఆర్డీఓ కోర్టులో వేేసారని, రెండు సంవత్సరాలు దాటిన దాని తీర్పు రాలేదని. మాకు జీవనాధారం అయిన భూమి మా నుండి అన్యాయం గా కబ్జా చేశారని, దయ చేసి మా భూముల పై హక్కును కల్పించాలంటూ రైైతులు కోరుతున్నారు.