JMS News Today

For Complete News

బావిలోకి దిగిన తరువాత.. ఏమి జరిగింది

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కొమురం భీం, జూలై 10: బావిలో వెలువడిన విష వాయువు లు ముగ్గురు ప్రాణాలను బలిగొంది. ఈ హృదయ విదారక ఘటన    కొమురం భీం జిల్లా కౌటాల మండలం ముత్యంపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామంలో బావిలో ఉన్న పూడిక తీసేందుకు బావిలోకి ముగ్గురు యువకులు దిగారు. అయితే, బావిలో నుంచి విషవాయువులు వెలువడటంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో రాజేష్ (26), శ్రీనివాస్(25), మహేష్ (18) అనే ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఆ గ్రామంలో కలకలం రేపగా, మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *