రెచ్చిపోయిన అడవి పంది…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
మల్హర్, జూలై 30: రైతులపై అడవి పంది దాడి చేసిన ఘటన జయశంకర్ భూపలపల్లి జిల్లాలోని మల్హర్ మండలం కొండపేట గ్రామంలో చోటు చేసుకుంది. తోటలో కలుపు పనిచేస్తున్న ముగ్గురు రైతులపై అడవి పంది దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన రైతులను స్థానికులు మహాదేవ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. బాధితులను సంపత్, రాజు, లక్ష్మీభాయ్లుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.