పోలీసులు శుభవార్త వింటారా…!
1 min read
పోలీసులు శుభవార్త వింటారా…!
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 23: ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు ఇస్తున్న వారాంతపు (వీక్లి ఆప్) సెలవు ల విధానాన్ని తెలంగాణలో కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోలీసులు 24 గంటలు పనిచేసి ఒత్తిడికి లోనవుతున్నారని భావించిన కేసీఆర్ సర్కార్…వారికి శుభవార్త చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రంలో అమలు చేస్తుండడంతో హామీ మేరకు తెలంగాణ పోలీసులకు వారాంతపు సెలవును ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీసుల సంఖ్య పరిగణలోకి తీసుకుని రోజుకు ఇద్దరికి లేదా ముగ్గురికి, ఒకవేళ ఒకేరోజు చాలామందికి వారాంతపు సెలవు కావాలని పోటీపడితే లాటరీ పద్దతి ద్వారా వీక్లీ ఆఫ్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వీక్లి ఆప్ అమలు చేస్తే ఎన్నోఏళ్లుగా నిరీక్షిస్తున్న పోలీసుల కల నెరవేరనుంది.