గన్నేరువరంలో దారుణం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 4: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గన్నేరువరం మండలం మాదాపూర్ శివారులో మొక్కజొన్న చేనులో ఓ వివాహిత మహిళ (45) అత్యాచారం, దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపగా, స్థానికంగా విషాదం నింపింది. ఘటన స్థలాన్ని సీపీ కమలాసన్ రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
The articles are very good