కరీంనగర్ లో దారుణం….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 23: ఓ గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ విషాద ఘటన కరీంనగర్ లోని జిల్లా కోర్టు సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలి వయస్సు 35-40 సంవత్సరాలు, చామనచాయ రంగు కలిగి, కుర్తా పైజమా- రాణి కలర్ (ముదురు పింక్) కుర్తా, నీలి రంగు పై గుండ్రని డిజైన్లు కల పైజమా ధరించి ఉంది. అలాగే మెడలో పసుపు తాడులో ఎరుపు, నలుపు పూసలు, ఒక పుస్తె లో ఏసుక్రీస్తు సిలువ డిజైన్, కాళ్లకు పట్టగొలుసులు, ఎడమ చేతికి స్టీలు గాజులు, చెవులకు స్టీలు చెవి కమ్మలు, ఎడమ చేతి పై మ్యూజిక్ సింబల్ గల టాటూ (పచ్చబొట్టు) ఉంది. మృతురాలికి సంబంధించి వివరాలు తెలిసిన వారు పోలీసుల (9440795107, 9440795111,డయల్ 100)కు
తెలియజేయాలని, తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు తగిన పారితోషికం కూడా అందిస్తామని టూ టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు.