పుస్తక పఠనంతో అనేక విషయాలపై అవగాహన
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 11: పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, తద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చునని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ దామోదర్ రెడ్డి తెలిపారు. యువతులు, విద్యార్థినులు షీటీం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులకు పుస్తకాల పట్ల ఆసక్తిని పెంచేందుకు కరీంనగర్ లోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దామోదర్ రెడ్డి ముఖ్య అథితిగా హాజరై పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్బంగా సరస్వతి దేేేవిని పూజించారు. జ్యోతిభా పూలే, అబుల్ కలాం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ భాషల్లో ప్రచురించిన పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా సీఐ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం పాఠశాల సిబ్బంది సీఐ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్, మహిళా పోలీస్ స్టేషన్ ఎఎస్ఐ విజయ మణిి, పాఠశాల ఉపాయులు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.