హైదరాబాద్ లో మర్డర్…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 29: హైదరాబాద్ లోని ఫిలింనగర్లో సోమవారం దారుణం జరిగింది. ప్రేమ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, స్నేహితులే ప్రేమ్‌ను కొట్టి చంపినట్టుగా తెలుస్తోంది. ప్రేమ్‌కు, సతీశ్ అనే వ్యక్తికి మధ్య ఉన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.