యువ హీరోలను వెంటాడుతున్న ప్రమాదాలు : కలవరంలో అభిమానులు
1 min read
కరీంనగర్ : యువ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. సినిమా చిత్రీకరణలో ఇటీవలీ కాలంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటూ యువ హీరోలు గాయపడుతున్నారు. ఈ వరుస ప్రమాదాలు అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, గోపీచంద్, నాని, వరుణ్ తేజ్, నాగ శౌర్య ఇలా…చిత్ర షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా థాయ్ లాండ్ లో 96 చిత్రం కోసం స్కై డ్రైవ్ ప్రాక్టీస్ చేస్తున్న యువ హీరో శర్వానంద్ గాయపడ్డాడు. భజం, కాలుకు గాయాలైనట్లు సమాచారం. శర్వానంద్ కు శస్త్ర చికిత్స చేయనున్నట్లు సమాచారం. ఏదిఏమైనా టాలీవుడ్ లో వరుస ప్రమాదాలు జరుగుతూ యువ హీరోలు గాయపడుతుండడంఅభిమానులని ఆందోళనకి గురిచేస్తున్నాయి.