మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 7: మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని తిరుమల్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న కొండపర్తి శివప్రసాద్ (30) అనే యుుువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం…శివప్రసాద్ విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. సుమారు 3నెలల క్రితం పెద్దపెల్లి జిల్లాకు బదిలీ కాగా, ప్రతిరోజు కరీంనగర్ నుంచి విధులకు వెళ్లి వస్తుంటాడు. అయితే, శివప్రసాద్ ఇటీవల కుటుంబానికి తెలియకుండా సుమారు 5 లక్షల రూపాయలు అప్పులు చేశాడు. తనకు వచ్చే నెలసరి జీతంతో అప్పులు తీర్చడం కష్టంగా మారింది. ఈ విషయంపై తెలిసిన కుటుంబసభ్యులు అప్పు ఎందుకు చేసావ్ అని అడగగా, రెండు మూడు రోజులుగా మూడిగా ఉంటున్న శివ ప్రసాద్ మంగళవారం డ్యూటీ కి వెళుతున్నానని ఇంటిలో చెప్పి వెళ్ళాడు. అదేరోజు నగరంలోని ఒక హోటల్లో ఓ గది అద్దెకు తీసుకొని మద్యం సేవించి అదే మద్యం మత్తులో ఎదో విష పదార్థం కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు అతడి కోసం వెతుకుతున్న క్రమంలో బుుధవారం హోటల్ ముందు పార్క్ చేసి వున్న అతని బండిని చూసి గది వద్దకు వెళ్లి చూడగా మరణించి ఉన్నాడు. మృతుడి భార్య ప్రవల్లిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ ఇనస్పెక్టర్ తులా శ్రీనివాసరావు తెలిపారు.