శ్రీవారి సేవకు వెళ్ళి…శాశ్వతంగా దూరం
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
తిరుపతి, జూలై 9: శ్రీవారి సేవకు వెళ్ళిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు చెందిన ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళాడు. ఈ విషాద ఘటన తిరుమల లో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల ఖిలావనపర్తి గ్రామానికి చెందిన మోతె సుమన్ (27) అనే యువకుడు తిరుమల శ్రీవారి సేవకు వెళ్ళాడు. తిరుమలలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, సుమన్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీవారి సేవకు వెళ్ళి మృత్యువాత పడటం కలచివేసింది. మృతుడి కుటుంబం లో తీరని విషాదం నెలకొంది. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.