కన్న కొడుకును హతమార్చిన తండ్రి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
పెగడపల్లి, నవంబర్ 13: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రి కన్న కొడుకును కత్తి తో పొడిచి హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తండ్రి చేతిలో నక్క జలందర్ (21) హతమయ్యాడు. తండ్రి రమేష్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు కుటుంబ కారణాలేనని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.