యువకుడి దారుణ హత్య…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రుద్రంగి, సెప్టెంబర్ 16: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగుల చేతిలో సురేందర్ (22) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం దేవాగత్ తండా గ్రామ పరిధిలో కున్సోత్ తండాకు చెందిన సురేంద్ర (22) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి అతడి తల, మొండెంను వేరు చేశారు. పోలీసులు సోమవారం గాలింపు చర్యలు చేపట్టగా, హనుమాన్ తండా శివారులో సురేందర్ మృతదేహం లభ్యమైంది. అయితే, ప్రేమ వ్యవహారంలో హత్య చేశారంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో హనుమాన్ తండాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసు అధికారులు ఏలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News very good