మరో యువకుడి దారుణ హత్య…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
సిరిసిల్ల, సెప్టెంబర్ 18: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. రెండురోజుల క్రితం చందుర్తి మండలంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మరిచిపోక ముందే మరో యువకుడి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ముస్తాబాద్ మండలం కొండాపూర్ లో మంగళవారం అర్ధరాత్రి తరువాత చోటుచేసుకుంది. జిల్లాలో వరుస ఘటనలు కలకలం రేపుతోంది. కొండాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్న నగునూరి శ్రీనివాస్ అనే వ్యక్తి గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు శ్రీనివాస్
తలపై బండరాయితో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన వ్యక్తిగా ఆధార్ కార్డు సహాయంతో స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.