కొట్టుకున్న అమ్మాయిలు….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే)
హైదరాబాద్, జూన్ 23: అందరూ అమ్మాయిలే, అందులో వారందరూ డబ్బున్న ఇంటి బిడ్డలే. వీకెండ్ (వారాంతాన్ని) ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో శనివారం రాత్రి బయటకు వచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్ లో పుల్ గా మందు కొట్టారు. ఇంకేముంది వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ… రోడ్డుపై కొట్టుకున్నారు. పొట్టిపొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు, రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటుంటే, అక్కడ వందలాది మంది జనం పోగయ్యారు. ఈ ఘటన రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కేబీఆర్ పార్క్ వద్ద చోటుచేసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని పబ్ ల వద్ద న్యూసెన్స్ పెరిగిపోయిందని, వారాంతం వస్తే గొడవలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న వేళ…ఈ ఘటన నిదర్శనం గా చెప్పుకోవచ్చు. కాగా, ఓ అమ్మాయి తన చివరి పెగ్ గా తెచ్చుకున్న మద్యాన్ని మరో అమ్మాయి తాగడమే మొత్తం గొడవకు కారణమని అక్కడ గుసగుసలు. ఈ విషయంం తెెలుసుకుని ట్రాఫిక్ పోలీసులు అక్కడిికీ రాగా, వారినీ అదుపులోకి తీసుకునేందుకు మహిళా పోలీసులు లేక, తలపట్టుకోవాల్సి వచ్చింది. చివరకు మహిళా కానిస్టేబుళ్లను పిలిపించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కథ సుుఖాంతం అయింది. ఇది ఇలా ఉండగా, శనివారంం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర పరిధిలో దాదాపు 40 మందికి పైగా పట్టుబడ్డారు. ఓ నైజీరియన్ మాత్రం తనిఖీలకు సహకరించకుండా నానాయాగీ చేశాడు.